Sarileru nekevaru

4.0

4.0/5 ( సంక్రాంతికి వచ్చిన మొగుడు )

#కథ

ఆర్మీలో మహేష్ బాబు పవర్ ఫుల్ మేజర్. కొంతమంది ఉగ్రవాదులు స్కూల్ పిల్లలను బందించినపుడు, ఆ పిల్లలను రక్షించేందుకు రంగంలోకి దిగుతాడు మహేష్ అతని టీమ్. ఈ ఆపరేషన్ తరువాత మహేష్ కు ఊచించని కొన్ని మహేష్ కు ఎదురౌతాయి. ఆర్మీ విధించిన కొన్ని నిబంధనలకు లోబడి మహేష్ బాబు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ విజయశాంతిని వెతుక్కుంటూ కర్నూలు వస్తాడు. ఎక్కడో కాశ్మీర్ లో ఆర్మీ మేజర్ గా ఉన్న మహేష్ బాబు విజయశాంతిని వెతుక్కుంటూ ఎందుకు కర్నూల్ వచ్చారు? ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది? ప్రకాష్ రాజ్ ఎవరు ఏంటి? రష్మిక తో ఎలా పరిచయం కలిగింది అన్నది ఇతివృత్తం.

#విషయం

మహేష్ బాబు చాలా కాలంగా సామాజిక అంశాలతో కూడిన కథలతోనే సినిమాలు చేస్తున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి ఈ మూడు కూడా సామాజిక అంశాలతో కూడిన సినిమాలే. అయితే, మహేష్ అభిమానులు పక్కా మాస్ ఎంటర్టైనర్ సినిమా కావాలని కోరుకుంటున్నారు. అలాంటి సినిమా సరిలేరు నీకెవ్వరుతో తీరిందని చెప్పొచ్చు. సినిమా కథను కాశ్మీర్లో ప్రారంభిచారు. ఆర్మీ మేజర్ గా మహేష్ యాక్షన్ తో అదరగొట్టారు. ఉగ్రవాదుల నుంచి మహేష్ అతని టీమ్ పిల్లలను ఎలా రక్షించారో అద్భుతంగా చూపించారు. యాక్షన్ మోడ్ లో సాగిన కథ ఆ తరువాత ఎంటర్టైనర్ గా మారుతుంది. కాశ్మీర్ నుంచి రైలులో బయలుదేరిన మహేష్ బాబుకు, రష్మిక, రావు రమేష్, అతని ఫ్యామిలీతో ఏర్పడిన అనుబంధం, ఫన్ సినిమాకు ప్లస్ అయ్యింది. ట్రైన్ ఎపిసోడ్ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీగా చిత్రీకరించారు. ఫస్ట్ హాఫ్ అనిల్ మార్క్ కామెడీతో సరదాగా సాగిపోయింది. అయితే, సెకండ్ హాఫ్ మొత్తం సీరియస్ గా నడుస్తుంది.
ఓ మర్డర్ కేసులో పోరాటం చేస్తున్న విజయశాంతికి అండగా ఉండేందుకు మహేష్ బాబు కర్నూలు వస్తారు. మహేష్, విజయశాంతి, ప్రకాష్ రాజ్ లు సెకండ్ హాఫ్ లో పోటీపడి నటించారు. ప్రకాష్ రాజ్ విజయశాంతి కుటుంబంపై పగ తీర్చుకోవాలని చూసిన సమయంలో దానికి మహేష్ బాబు అడ్డుకోవడం వంటి సన్నివేశాలు సీరియస్ గా సాగుతుంటాయి. మధ్యలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు. మహేష్ బాబుకూడా సెకండ్ హాఫ్ లో పిట్టకథలు చెప్తూ ఆకట్టుకున్నాడు. అయితే, సెకండ్ హాఫ్ కొద్దగా సాగదీసినట్టుగా ఉంటుంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా క్లైమాక్స్ ఉంటుంది.

#నటీనటులు

ఆర్మీ మేజర్ గా, సమాజంలో అన్యాయాన్ని ఎదుర్కొనే ఓ యువకుడిగా రెండు వేరియేషన్స్ లో మహేష్ అదరగొట్టాడు.
13 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి సినిమాకు ప్లస్ అయ్యింది. తనలో నటన చాతుర్యం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది.
మహేష్ ను ప్రేమించే అమ్మాయిగా, తనదైన మ్యానరిజంతో ఆకట్టుకుంది రష్మిక. ప్రకాష్ రాజ్ విలన్ గా ఆకట్టుకున్నారు.
మిగతా నటీనటులు తమ పరిధిమేరకు మెప్పించారు.

#సాంకేతికవర్గం

అనిల్ సిద్ధహస్తుడు, మహేష్ అభిమానులకు ఏం కావాలో వాటిని ఈ సినిమాలో చూపించి మెప్పించారు.
దేవిశ్రీ పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దేవి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది.
రత్నవేలు కెమెరా పనితనం సూపర్ అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది.
ఎడిటింగ్ దర్శకుడి అభిరుచి మేర నడిచింది.
అనిల్ సుంకర నిర్మాణ విలువలు బాగున్నాయి.

#కొసమెరుపు

సంక్రాంతి సంబరాలు రెట్టింపు చేస్తుంది. ఈ చిత్రం కుటుంబసమేతంగా తప్పక చూడొచ్చు.