Disco raja review

4.5

4.5 / 5 ( మాస్ మహారాజా సత్తా చూపించాడు )

#కథ :

రవితేజ లడఖ్ ప్రాంతంలో ఐస్ ట్రెక్కింగ్ చేస్తున్న ఒక గ్రూప్ కు స్పృహ లేకుండా దొరుకుతాడు.
మరోపక్క నభా నటేష్ మరియు నరేష్ సహా కొంతమంది సైంటిస్టులు చనిపోయిన మనుషుల్లో మళ్ళీ జీవం పోసే రీసెర్చ్ చేస్తుంటారు. అలా వారికి రవితేజ దొరకగా అతనిపై వీళ్ల రీసెర్చ్ ఎలా చేశారు ?
ఈ “డిస్కో రాజా” ఎవరు..? అన్నది ఇతివృత్తం.

#నటీనటులు

రవితేజ “డిస్కో రాజా” పాత్రతో సినిమాకు ఒక సరికొత్త ఎనర్జీ ఇచ్చారు.
పాయల్ రాజ్ పుత్ మరియు నభా నటేష్ లు రెండు షేడ్స్ కు తగ్గట్టుగా మంచి నటన కనబర్చారు.
నరేష్,వెన్నెల కిషోర్ అలాగే వింటేజ్ టైం లో సునీల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు.
బాబీ సింహా తనలోని విలన్ యాంగిల్ ను అద్భుతంగా చూపించారు.

#సాంకేతికవర్గం

వి ఐ ఆనంద్ ఈ సినిమాని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు.
థమన్ అందించిన పాటలు పర్వాలేదు.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఆకట్టుకోదు కానీ ఈ సినిమాలోని పాటలు విజువల్ పరంగా ఆకట్టుకుంటాయి.
కార్తీక్ గట్టంనేని అందించిన సినిమాటోగ్రఫీ చిత్రానికి మరో ప్రాణం.
ఎడిటింగ్ దర్శకుడి అభిరుచికి తగ్గట్టుగా సాగింది.
నిర్మాణ విలువలు బాగున్నాయి.

#కొసమెరుపు

ఈ చిత్రంలో ఎంచుకున్న పాయింట్ చాలా వినూత్నంగా ఉండడమే కాకుండా దానిని తెరకెక్కించిన విధానం ఖచ్చితంగా సినిమా చూసే ప్రేక్షకులను థ్రిల్ చెయ్యక మానదు.
కుటుంబసమేతంగా అందరూ చూడదగ్గ చిత్రం.

#discorajareview #డిస్కోరాజారివ్యూ #Firstreview #తొలిరివ్యూ