Ala vaikuntapuramlo

4.3

#కథ
రామచంద్ర(జయరాం) ఆఫీస్‌లో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు వాల్మీకి(మురళీశర్మ). ఇద్దరికీ ఒకేసారి ఆస్పత్రిలో పిల్లలు పుడతారు. అయితే రామచంద్ర బిడ్డ చనిపోయి పుట్టాడని తెలియడంతో వాల్మీకి తనకు పుట్టిన కొడుకును తన యజమానికి ఇచ్చేస్తాడు. ఒక నర్సు సాయంతో బిడ్డలను మార్చేస్తారు. బిడ్డ చనిపోయాడనుకుని తీసుకెళ్తుండగా, ఆ బిడ్డ బతుకుతాడు. అయితే, తనలా పేదరికంలో తన కొడుకు బతకకూడదని అసలు నిజాన్ని చెప్పకుండా యజమాని కొడుకును తీసుకెళ్లి బంటు(అల్లు అర్జున్‌)అని పేరు పెట్టి పెంచుకుంటాడు. ఒక మధ్యతరగతి వ్యక్తిలా అతడిని పెంచుతాడు. మరోవైపు వాల్మీకి కొడుకు రాజ్‌మనోహర్‌(సుశాంత్‌)గా రామచంద్రదగ్గర పెరిగి పెద్దవాడవుతాడు.
మరి అసలు నిజం ఎలా తెలిసింది? ఎవరు? చెప్పారు?
తెలిసిన తర్వాత బంటు ఏం చేశాడు? చివరకు అసలు తల్లిదండ్రులను కలుసుకున్నాడా?
మధ్యలో అమూల్య(పూజాహెగ్డే)ఎలా పరిచయం అయింది? అప్పలనాయుడు(సముద్రఖని) ఎవరు? అతడిని బంటు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది ?.
పూజ బంటు ప్రేమ చివరికి గెలిచిందా? లేదా?
అసలు బంటు అల వైకుంఠపురంలోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు? ఎంటర్ అయిన పని పూర్తి చేశాడా? లేదా? అన్నదే ఇతివృత్తం.

#నటీనటులు
అల్లు అర్జున్ సినిమా మొదటి నుంచి చివరి దాకా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. అలాగే కామెడీ టైమింగ్ తో కూడా మెప్పించాడు.
పూజ హెగ్డే పాత్ర చెప్పుకోదగినది కాకపోయినా కావాల్సిన నేత్రానందాన్ని అయితే ఇచ్చింది.
సుశాంత్ ది ముఖ్య పాత్రే అయినా పెద్దగా పెర్ఫార్మన్స్ కి స్కోప్ లేదు.
నివేతా పాత్ర ఉన్నట్లు కూడా అనిపించదు.
నవదీప్, రాహుల్ రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, హర్ష వర్ధన్, బ్రహ్మాజీలు అక్కడక్కడా నవ్వించారు.
కానీ సునీల్ పాత్రే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
కీలక పాత్రల్లోజయరాం, టబు, సచిన్, రోహిణిలు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
వెన్నెల కిషోర్ వచ్చేది ఒక్క సన్నివేశమే అయినా బాగా నవ్విస్తాడు.

#సాంకేంతికవర్గం
ఛాయాగ్రహణం చాలా హుందాగా కనిపిస్తుంది.
తమన్ తన నేపథ్యసంగీతంతో మాయ చేసాడు.
అల్లూ అర్జున్ కాస్ట్యూమ్స్ , పూజా హెగ్డే అందాలు ఇవన్నీ కాస్ట్యూమ్ టీం వర్క్ ని చూపించాయి.
దర్శకుడి అభిరుచికి తగ్గట్టుగానే ఆర్ట్ టీం కూడా తమ కష్టం చూపించింది.
రామ్ – లక్షణ్ మాస్టర్స్ ఊర మాస్ గానే కాదు సూపర్ స్టైలిష్ గా కూడా యాక్షన్ చేయిస్తారని ప్రూవ్ చేసే సినిమా ఇది.
నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది.
త్రివిక్రమ్ గారి దగ్గరికి వస్తే.. కథ, కథనం, సంభాషణలు .. ఇలా అన్నీ క్వాలిటీ గా జనాల మనసులకి హత్తుకునేవే .
నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

#కొసమెరుపు
పండక్కి కావాల్సిన వినోదం పుష్కలంగా ఉన్న చిత్రం ఇది.కుటుంబ సమేతంగా అన్ని వయస్కుల వాళ్ళు చూడొచ్చు.